Header Banner

సింహాచలం ఆలయంలో విషాదం! గోడకూలి 9 మంది భక్తుల దుర్మరణం!

  Wed Apr 30, 2025 08:30        Others

ప్రఖ్యాతి చెందిన సింహాచలం ఆలయంలో దిగ్బ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ వెలిసిన శ్రీ వరాహలక్ష్మీ శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. స్వామివారికి నిర్వహించే వార్షిక చందనోత్సవం వేడుకల సందర్భంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

సమాచారం అందిన వెంటనే హోమ్, విపత్తు నిర్వహణ వ్యవహారాల శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆలయానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ దుర్ఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దురదృష్టకర ఘటనగా పేర్కొన్నారు. సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు వివరించారు. సింహాచలం లక్ష్మీనరసింహ స్వామివారికి ప్రతి సంవత్సరం చందనోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో నిజరూప దర్శనం ఇస్తారు. నిజరూప దర్శనం చేసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునే ఉన్న ఒడిశా నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఏడాది చందనోత్సవానికి దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి. దీనికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఆలయంలో భద్రతా ఏర్పాట్లు, భక్తుల ప్రవేశ- నిష్క్రమణ మార్గాలు, క్యూ లైన్ నిర్వహణ వ్యవస్థ, ఇతర సౌకర్యాలను విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, ఇతర అధికారులు స్వయంగా పరిశీలించారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు కొండ దిగువన హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రాంగణంలో షామియానాలు వేశారు. రూ.300, రూ.1000, రూ.1,500 టిక్కెట్లు ఉన్న భక్తుల కోసం వేర్వేరుగా క్యూ లైన్లకు ఏర్పాటు చేశారు.వాహనాల పార్కింగ్ వ్యూహాన్ని వివరంగా వివరించారు. ఈ 300 రూపాయల ప్రత్యేక దర్శనం క్యూలైన్‌లో తాజాగా ఈ ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న 20 అడుగుల గోడ కుప్పకూలింది. విశాఖపట్నం జిల్లాలో రాత్రి ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి గోడ కూలి పోయింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇది కూడా చదవండి: అమెరికాలో విషాదం..! భార్య, కుమారుడిని చంపి టెక్కీ ఆత్మహత్య!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #SimhachalamTragedy #TempleAccident #WallCollapse #DevoteesKilled #VisakhapatnamNews #Chandanotsavam